చాలా మంది ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే జీర్ణ ప్రక్రియ సరిగా జరగాలన్నా, ఏ సమస్యలు రాకుండా ఉండాలన్నా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. అజీర్తి, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు వచ్చాయంటే ఎంతగానో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే అజీర్తి సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే ఈ టిప్స్ ని పాటిస్తే అజీర్తి సమస్యలు రాకుండా ఉంటాయి.
అలానే ఈ ఆహార పదార్థాలు బాగా హెల్ప్ అవుతాయి. ఆయుర్వేదం ప్రకారం అగ్నిని బ్యాలెన్స్ చేసుకోవడం వలన జీర్ణప్రక్రియ బాగా జరుగుతుంది. అలాగే అజీర్తికి సంబంధించిన సమస్యలు ఉండవు. జీర్ణ వ్యవస్థకి అంతటికీ కూడా అగ్ని ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే సమస్యలు తగ్గించుకోవడానికి ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. మరి వాటి కోసం చూద్దాం.
మెంతులు:
ఆయుర్వేదం ప్రకారం మెంతులు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కడుపులో ఉండే చెడు పదార్థాలను తొలగించడానికి ఇది మనకు సహాయం చేస్తుంది. బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి కూడా హెల్ప్ చేస్తాయి. ఖాళీ కడుపున మెంతులని తీసుకుంటే అజీర్తి సమస్య నుండి బయట పడవచ్చు. ఏ సమస్య కూడా వుండదు.
అల్లం:
అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేద వైద్యంలో కూడా అల్లాన్ని వాడతారు. అజీర్తి సమస్యను పోగొట్టడానికి అల్లం మనకు ఎంతగానో సహాయం చేస్తుంది. టీ తో పాటు కొంచెం అల్లం వేసుకుని తీసుకుంటే ఏ సమస్య రాదు. అలానే మరెన్నో ఇతర ప్రయోజనాలు పొందవచ్చు అని ఆయుర్వేదం చెబుతోంది.