సైంటిస్ట్ లూ .. వైరాలజిస్ట్ ల దృష్టి లో ఇండియా సేఫ్ ? ఎందుకంటే … !

-

కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకీ పెరుగుతోంది. వైరస్ ఉన్న కొద్దీ మనుషులకు సోకటం తో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో కూడా వైరస్ ప్రభావం చాలా గట్టిగా ఉంది. వైరస్ కి మందు లేకపోవటంతో పాటుగా అమెరికాలో ఉన్న వాతావరణం వైరస్ కి బాగా సహకరించడంతో ప్రపంచంలోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న దేశంగా అమెరికా మొదటి స్థానంలో ఉంది. యూరప్ మరియు ఇంకా కొన్ని దేశాలలో వైరస్ ప్రభావం చాలా గట్టిగా ఉంది.People, Please Stop Running Away From Coronavirus Quarantine ...ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే రాబోయే రోజుల్లో యూరప్ ఖండంలో ఈ వైరస్ వల్ల చాలా దేశాలు ప్రపంచ పటంలో కనుమరుగవుతాయి అని అంటున్నారు. ఇదిలావుండగా ఈ వైరస్ అరికట్టడానికి ఒకే ఒక మార్గం నియంత్రణ కావడంతో ప్రస్తుతం ఇండియాలో 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. దేశ ప్రజలు ఎవరు కూడా ఇల్లు వదిలి బయటకు  రాకూడదు అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.

 

ఇటువంటి తరుణంలో సైంటిస్టులు మరియు వైరాలజీస్ట్ లు ఇండియాలో ఉన్న పరిస్థితి బట్టి వాళ్ళ దృష్టిలో ఇండియా చాల సేఫ్ జోన్ లో ఉందని అంటున్నారు. ఎందుకంటే మన దేశంలో చిన్న పిల్లలకు బిసిజి టీకా వేస్తున్నాం కదా అదీ క్షయకు వ్యాక్సిన్. కొన్ని దేశాలలో ఇది తప్పనిసరి గా వెయ్యాలి. అటువంటి దేశాలలో భారతదేశం ఉంది. కాగా బిసిజి టీకా వేస్తున్న దేశాలలో ఈ వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉందట. దీంతో సైంటిస్ట్ లూ .. వైరాలజిస్ట్ ల దృష్టి లో ఇండియా చాలా సేఫ్ జోన్ లో ఉందని అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news