సుడాన్ లో రెండు వర్గాల మధ్య భీకర పోరు…60 మంది మృతి

-

సూడాన్ లో రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లలో 60మంది మృతిచెందినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. మరో 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డట్లు పేర్కొంది. పశ్చిమ డార్ఫర్‌ ప్రావిన్సులోని మస్తేరీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Sudan
Sudan

సూడాన్లోని ‘యూఎన్‌ ఆఫీస్‌ ఫర్‌ ది కోఆర్డినేషన్ ఆఫ్‌ హుమానిటేరియన్‌ అఫైర్స్‌’ (ఓసీహెచ్‌ఏ) వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఓ వర్గానికి చెందిన 500మంది సాయుధులు మస్తేరీ గ్రామంపై దాడికి దిగారు. మసలిట్‌, ఇతర అరబ్‌ తెగల మధ్య ఈ ఘర్షణలు జరిగాయి. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఈ ఘర్షణలు సోమవారం ఉదయం వరకు కొనసాగాయి. మొత్తం 60మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. 60మంది తీవ్రంగా గాయపడడం వల్ల వారందరినీ హెలికాప్టర్‌లో జెనేనా పట్టణంలోని ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో దుండగులు అనేక ఇళ్లను దోచుకున్నారు. అనంతరం వాటికి నిప్పంటించారు. దాడి తరువాత రక్షణ కల్పించాలని కోరుతూ స్థానికులు నిరసన చేపట్టారు. అధికారులు చర్యలు తీసుకునే వరకు చనిపోయిన వారికి అంత్యక్రియలు చేసేది లేదని స్థానిక నాయకుల నివాసాల ముందు బైఠాయించారు.

 

నియంతపాలకుడు సుల్తాన్‌ అల్‌-బషిర్‌ను మిలిటరీ తిరుగుబాటుతో గద్దె దింపిన తర్వాత సూడాన్ ప్రజాస్వామ్య పాలన దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అక్కడ మిలిటరీ ఆధ్వర్యంలో పాలన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓసీహెచ్‌ఏ అనేక పునరావాస కార్యక్రమాలు చేపట్టింది. తాజా అల్లర్లతో ఆ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news