ఇంటి చిట్కాలతో పాంక్రియాటైటిస్ ఇక మాయం…!

-

మీరు పాంక్రియాటైటిస్ తో బాధపడుతున్నారా…? అయితే ఈ చిట్కాలను మీరు ఉపయోగించండి. దీనితో మీకు ఉపశమనం కూడా లభిస్తుంది. అయితే పాంక్రియాటైటిస్ కు ఇమిడియట్ మెడికల్ అటెన్షన్ చాలా ముఖ్యం. అయితే ట్రీట్మెంట్లో ఐబిసి యాంటీబయోటిక్స్ అలాగే పెయిన్ మెడికేషన్ కూడా వాళ్ళు సూచిస్తారు. మీరు మెడికల్ ట్రీట్మెంట్ తో పాటు హోమ్ రెమెడీస్ ని కూడా పాటిస్తే మీ ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. చాలా రిలీఫ్ గా ఉండి పెయిన్ కూడా తగ్గుతుంది. అయితే పాంక్రియాటైటిస్ అనే కండిషన్ పాంక్రియాస్ అనే ఆర్గాన్ వాపును సూచిస్తోంది.

 

పొత్తికడుపులో పాంక్రియాస్ ఉంటుంది. మనం తినే ఆహారాన్ని శరీరంలోని సెల్స్ కు ఫ్యూయెల్ గా మార్చడంలో పాంక్రియాస్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మొత్తం రెండు రకాల ఫంక్షన్స్ ని ఇది నిర్వర్తిస్తుంది. ఒకటి ఎక్సోక్రైన్ ఫంక్షన్ అలానే రెండవది ఎండోక్రైన్ ఫంక్షన్. ఇది బ్లడ్ షుగర్ రెగ్యులేట్ చేస్తుంది. పొత్తి కడుపులో నొప్పికి హాట్ కంప్రెస్ తక్షణ ఉపశమనం లభిస్తుంది. అలానే నొప్పి కూడా తగ్గుతుంది. కాబట్టి హాట్ వాటర్ బాటిల్ లేదా హీటింగ్ ప్యాడ్ ని మీరు తీసుకోండి టవల్ తో వీటిని చుట్టండి. ఆ తరువాత నొప్పిగా ఉన్న ప్రాంతంలో ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉంచండి. ఇలా ఉపసమనం లభిస్తుంది కాబట్టి మీరు దీనిని రిపీట్ చేయండి.

అలానే హాట్ బాత్ లేదా షవర్ తో కూడా కడుపు నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది కనుక మీరు రోజుకు రెండుసార్లు వేడి నీళ్లతో స్నానం చేయండి. ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను కప్పుడు వెచ్చటి నీటిలో కలపండి. ఆ తర్వాత ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని మరియు తేనెను కూడా ఇందులో కలపండి. ఫైనల్ గా ఈ సొల్యూషన్ ను రోజుకు రెండుసార్లు తాగండి. ఇలా చేస్తే కూడా ఉపశమనం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news