తెలంగాణా ఆరో కరోనా కేసు…!

-

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. అయినా కరోనా మాత్రం ఒక్కొక్కటిగా బయట పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం కరోనా విషయాన్ని చాలా సీరియస్ గానే తీసుకుంది. ఈ కరోనా ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఈ వైరస్ నివారణకు కొన్ని నిర్ణయాలు తీసుకుంది.

స్కూల్స్, కాలేజేస్, మూవీ థియేటర్లు, షాపింగ్ మాళ్లను మూసేసింది. మార్చి నెలాఖరు వరకూ ఇది అమల్లో ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ తెలంగాణలో ఆరో కరోనా పాటిజివ్ కేసు నమోదు అయింది. విదేశాల నుంచీ ఇండియా వచ్చిన వ్యక్తి కి ఇది సోకింది. బ్రిటన్ వెళ్లి వచ్చిన ట్రావెల్ హిస్టరీ ఇతనికి ఉందని ప్రభుత్వం తెలిపింది.

తెలంగాణలో ఆరో పాజిటివ్ కేసుగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. దేశవ్యాప్తంగా చూస్తే 150 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య ఎనిమిది వేల పై మాటే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎన్ని చర్యలు కఠినంగా తీసుకున్నా సరే చాపకింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇటలీ, ఇరాన్ కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news