ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు ఎప్పుడు…? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలియదు గాని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం బాగానే ఎదురు చూస్తున్నారు. అయిదేళ్ళ క్రితం రాజధాని అమరావతి అని అప్పటి ప్రభుత్వం చెప్పడంతో హైదరాబాద్ లో స్థిరపడిన ఉద్యోగులు అందరూ విజయవాడ, గుంటూరు నగరాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని సెటిల్ అయ్యారు.
ఇప్పుడు రాజధానిగా విశాఖను ప్రకటించడంతో వాళ్ళు అందరూ భార్యా, భర్తా, పిల్లలతో కలిసి విశాఖ వెళ్లిపోవాలి. ఇది ఏమో విద్యా సంవత్సరం చివర్లో ఉంది. దీనితో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యను దృష్టిలో ఉంచుకుని, జూన్‌లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి, విశాఖలో కొత్త స్కూళ్లు, కాలేజీల్లో తమ పిల్లలను చేర్చుకునే వెసులుబాటు కూడా కలుగుతుంది.
దీనితో ప్రభుత్వం మే నెలాఖరు నాటికి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. విశాఖకు తరలించిన తర్వాత ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సెక్రటేరియట్ తరలింపుపై ఏ క్షణమైనా ఉత్తర్వులు రావొచ్చని ఉద్యోగులు భావించారు. అయితే యునియన్ తో చర్చించిన తర్వాత… ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకుంది అంటున్నారు.