మన దేశంలోని ఆ గ్రామంలో 5 రోజులు స్త్రీలు బట్టలు లేకుండా ఉంటారట..

-

వివిధ మతాలు, సంప్రదాయాల సమ్మేళనం భారతదేశం.. ఎన్నో కులాలు, మరెన్నో ఆచారాలు.. మనకు తెలిసినవి కొన్నే తెలియనివి బోలెడు.ఆఫ్రికన్ తెగలలో, స్త్రీలు పురుషులచే కొట్టబడతారు.. బట్టలు ధరించడం ఆచారం కాదు. అలాగే చాలా రోజులుగా మహిళలు బట్టలు లేకుండా జీవించే ఓ గ్రామం మన దేశంలోనూ ఉందంటే మీరు ఆశ్చర్యపోతారు. స్త్రీల అస్తిత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి సంప్రదాయాలు సుదూర గిరిజనుల్లోనే కాకుండా మన దేశంలోనూ ఉంది. ఇండియాలో అలాంటి గ్రామం ఎక్కడుందా అనుకుంటున్నారా..? ఒక నిమిషం ఆలోచించండి. ఏ రాష్ట్రంలో ఉండొచ్చంటారు..?
హిమాచల్ ప్రదేశ్‌లోని మణికర్ణ లోయలో శతాబ్దాలుగా స్త్రీలు బట్టలు లేకుండానే జీవిస్తున్నారు. పిని గ్రామంలో నివసించే మహిళలు సంవత్సరానికి 5 రోజులు బట్టలు లేకుండా నగ్నంగా ఉండాలి. ఈ సంప్రదాయం శ్రావణ మాసంలో నిర్వహిస్తారు.. దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. అయితే ఈ 5 రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళ ముందుకి రారు, ఇంట్లో తాళం వేసి ఉండరు, నవ్వరు కూడా.

భయంతో సంప్రదాయాన్ని పాటిస్తున్నారట..

శతాబ్దాల క్రితం ఒక రాక్షసుడు ఉండేవాడని, ఆ ఊరిలో చక్కగా బట్టలు వేసుకున్న పెళ్లైన స్త్రీలను తీసుకెళ్లేవాడట… అందమైన బట్టలు వేసుకునే ఏ స్త్రీ అయినా వారిని తీసుకుని చిత్రహింసలు పెట్టేవాడంట. చివరికి దేవతలు రాక్షసుడిని చంపి స్త్రీలను రక్షించారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. స్త్రీ ఆడకపోతే అది అశుభం. అయితే, కాలక్రమేణా, ఈ సంప్రదాయంలో కొంచెం మార్పు వచ్చింది. మహిళలు సన్నని బట్టలు ధరిస్తారు మరియు 5 రోజులు దానిని మార్చరట..
టెక్నాలజీ విపరీతంగా ముందుకు వెళ్తున్నా.. ఇలాంటి సంప్రదాయాలు మనల్ని ఇంకా వెనక్కు నెడుతున్నాయి.. ఇది స్త్రీల ఆత్మగౌరవాన్ని, అస్థిత్వాన్ని దెబ్బతీస్తుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాంటి సంప్రదాయాలు పాటిస్తారో.. ఇదొక్కటే కాదు.. నేటికి చాలా తెగల్లో సంప్రదాయాలు, ఆచారాల పేరిట ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పెళ్లైన మూడు రోజుల పాటు శోభనం గదిలోనే మగ్గిపోయే ఓ ఆచారం ఉంది. శోభనం గదిలో ఉండటం సమస్య కాదు.. కనీసం వాళ్లు నీళ్లు, టాయిలెట్‌కు వెళ్లే వెసులుబాటు కూడా ఉండదు… మరి ఇది నరకం కాదా..!

Read more RELATED
Recommended to you

Latest news