బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ జీవితం ఎందరికో ఆదర్శం.. తన నటనతో ప్రవర్తనతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన అమితాబ్.. వయసుతో సంబంధం లేకుండా నేటి తరం నటీనటులతో పోటీపడుతూ అందరిలో స్ఫూర్తిని నింపుతుంటారు. తాజాగా బిగ్‌బీ తన పాత రోజులను గుర్తుతెచ్చుకున్నారు. ఆ పాతజ్ఞాపకాల గురించి తన బ్లాగ్‌లో రాశారు. తను సినిమాల్లోకి రాక ముందు తీసుకున్న చివరి జీతానికి సంబంధించిన రసీదును పంచుకున్న ఆయన.. ఆ రోజుల్లో ఎంతో ఖాళీగా ఉండేవారని చెప్పారు.
తన జీవితంలో జరిగిపోయిన జరుగుతున్న ఎన్నో విషయాలను తన అభిమానులతో పంచుకోవడానికి ప్రతిక్షణం ఆసక్తి చెబుతూ ఉంటారు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇప్పటికే పలుమార్లు తన జీవిత విశేషాలు ప్రేక్షకులతో పంచుకుంటూ వచ్చిన ఆయన.. జగ తన పాత రోజులని గుర్తు చేసుకున్నారు.. ఆ రోజుల్లో ఆయన పడిన కష్టాలను.. తన జీవితాన్ని చెప్పుకొచ్చారు..
“కోల్‌కత్తాలోని బ్లాకర్స్ కంపెనీలో నా ఉద్యోగం చివరి రోజు 30 నవంబర్ 1968. అప్పుడు నా జీతం రూ.1640 రూపాయలు. దానికి సంబంధించిన ఫైల్ ఇంకా భద్రంగా ఉంది. కోల్‌కత్తాలో ఉన్న రోజులు నా జీవితంలో అత్యంత స్వతంత్రమైన, ఖాళీగా ఉన్న రోజులు. 10 చదరపు అడుగులు ఉన్న గదిలో ఏడుగురితో పాటు ఉండేవాడిని. మా వద్ద డబ్బు లేకపోయినా పెద్ద బేకరీలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల దగ్గర నిల్చొనే వాళ్లం. ఏదో ఒకరోజు అందులోకి వెళ్తామనే ఆశతో ఉండేవాళ్లం.. షూటింగ్ కోసం మళ్లీ ఇదే కోల్‌కత్తాకి రావడం, అర్ధరాత్రి సమయాల్లో నేను ఉన్న వీధులను సందర్శించడం. ప్రతి ప్రదేశానికి వెళ్లడం, అక్కడ జరిగిన వాటిని గుర్తుచేసుకోవడం. అప్పటి స్నేహితుల్లో కొంతమందిని కోల్పోయాను. కొంతమందితో ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నా. ఎప్పటికీ ప్రేమగా ఉండడం ఎదుటివారికి మనమిచ్చే గొప్ప గౌరవం”.. అంటూ అప్పటినుంచి ఇప్పటివరకు తన జీవితం ఏ విధంగా మారిందో చెప్పుకోచ్చారు అమితాబ్..