తెలంగాణలో పెరిగిన క్రైం రేట్..పెరిగిన లైంగిక దాడుల కేసులు

-

తెలంగాణ లో క్రైం రేట్ పెరిగిందని.. ఎన్ సి ఆర్బీ 2021 నివేదిక వెల్లడించింది. గత ఏడాది కాలంగా తెలంగాణలో మహిళల పై దాడులు,చిన్నారుల పై లైంగిక నేరాలు భారీగా పెరిగాయి. మానవ అక్రమ రవాణాలో మళ్లీ మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని ఎన్ సి ఆర్బీ 2021 నివేదిక వెల్లడించింది. అటు సైబర్ నేరాల్లో మొదటి స్థానంలో తెలంగాణ నిలిచిందట.

బాలిక-అత్యాచారం
బాలిక-అత్యాచారం

రైతుల ఆత్మ హత్యల్లో తెలంగాణ 4 స్థానంలో నిలువగా… ఆర్ధిక నేరాల్లో రెండో స్థానంలో నిలిచింది. మహిళల పై నేరాలకు సంబంధించి కోర్టులో వీగిపోతున్న కేసుల్లో రాష్ట్రానికి మొదటి స్థానం దక్కిందని ఎన్ సి ఆర్బీ 2021 నివేదిక పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా దళిత మహిళలకు అవమానాలు కూడా జరిగాయట. వృద్ధుల పై దాడుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. మొత్తానికి 200 శాతం సైబర్ నేరాలు పెరిగాయని ఎన్ సి ఆర్బీ 2021 నివేదిక వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news