టీం ఇండియాకు ఏమైంది 5 ఓవర్ల లోపే మూడు క్యాచ్ లు డ్రాప్ !

-

శ్రీలంక లోని పల్లెకెల్ గ్రౌండ్ లో జరుగుతున్న ఇండియా మరియు నేపాల్ మ్యాచ్ లో ఇండియా చాలా పేలవమైన ఆటతీరును కనబరిచింది. మొదట టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ తీసుకుని నేపాల్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. బ్యాటింగ్ చేస్తున్న నేపాల్ షమీ వేసిన మొదటి ఓవర్ లోనే ఫస్ట్ స్లిప్ లో శ్రేయాస్ అయ్యర్ కు భుర్టెల్ సులభమైన క్యాచ్ ను ఇచ్చాడు.. కానీ గిల్ దానిని ఒడిసి పట్టుకోవడంలో విఫలం అయ్యాడు. ఆ తర్వాత సిరాజ్ వేసిన రెండవ ఓవర్ మొదటి బంతికి ఆసిఫ్ షేక్ కవర్స్ లోకి ఆడాలని ప్రయత్నించి ఫ్రంట్ లో ఉన్న కోహ్లీకి మంచి క్యాచ్ ను ఇచ్చాడు.. కానీ దానిని గ్రేట్ ఫీల్డర్ కోహ్లీ జారవిడిచాడు. ఆ తర్వాత మరో క్యాచ్ కీపర్ ఇషాన్ కిషన్ కు వెళ్లగా దానిని వదిలేసి.. కేవలం అయిదు ఓవర్ లలోపే మూడు క్యాచ్ లను వదిలేసి నేపాల్ కు స్వేచ్ఛగా పరుగులు చేసే అవకాశాన్ని ఇచ్చారు. దానితో రెచ్చిపోయిన ఓపెనర్లు షేక్ మరియు భుర్టెల్ లు మొదటి వికెట్ కు పది ఓవర్ లలోనే 65 పరుగులు జోడించారు.

ఆ తర్వాత జడేజా మరియు సిరాజ్ లు వికెట్లు తీయకుంటే ఇండియా పరిస్థితి చాలా దారుణంగా మారేది. ప్రస్తుతం వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయి ఉంది… నేపాల్ 178 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news