నేపియర్ లో టీమిండియా – న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టి-20 మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ మధ్యలో వర్షం పడడంతో డిఎల్ఎస్ ప్రకారం టై అయిందని ఎంపైర్లు ప్రకటించారు. డిఎల్ఎస్ ప్రకారం స్కోర్లు సమం అయ్యాయని తెలిపారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కాన్వే 59, ఫిలిప్స్ 54, పరుగులు చేశారు.
హర్షదీప్, మహమ్మద్ సిరాజ్ చరో నాలుగు వీకెట్లు తీసి సత్తా చాటారు. అనంతరం లక్ష్యసాధనకు దిగిన టీమిండియా 9 ఓవర్లలో 75 పరుగులు చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది. ఇక వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ టై గా ప్రకటించారు. దీంతో మూడు మ్యాచ్ల టి-20 సిరీస్ ను భారత్ 1-0 తేడాతో సొంతం చేసుకుంది. మొదటి టీ-20 వర్షంతో రద్దవ్వగా.. రెండవ టి20 లో భారత్ గెలిచింది.