భారతదేశంలో హిందుధర్మానికి ప్రత్యేకత ఉంది. ఆచారాలు, సాంప్రదాయాలకు నెలవు..కేవలం దేవుళ్ళకు మాత్రమే ప్రకృతిలో ఉండే జంతువులకు, పక్షులను కూడా మనవాల్లు ప్రేమిస్తారు. దేవుళ్ళతో సమానంగ పూజిస్తారు..దేవుళ్ళకు మహిమలున్నాయని భావిస్తారు.. అందుకు ఉదాహరణగా వినాయకుడు పాలు తాగడం, పాము శివుడికి పూజ చేయడం.. ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వంటి అనేక సంఘటనలను రుజువుగా చూపిస్తారు.
ఇవే కాదు దేశంలో ఎన్నో వింత ఘటనలు వెలుగు చూసాయి..వాటిని కళ్ళతో చూస్తేనే కానీ నమ్మడంలేదు.ఈ నేపథ్యంలో పవిత్ర కార్తీక మాసం వేళ ఉమ్మడి తూర్పుగోదావరి జిలాల్లో వింత సంఘటన చోటు చేసుకుంది.జిల్లాలోని కడియం మండలం కడియపులంక చింతలోని ఓ ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కళ్ళు తెరిచింది. సాధారణంగా దేవతా విగ్రహాలు కళ్లు మూసి ఉన్నట్లుగాని, సగం మాత్రమే తెరిచి ఉన్న ట్టుగా ఉంటాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది. నవంబరు 21న ఆఖరి కార్తీక సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో కడియపులంకలోని లక్ష్మీదేవి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు కళ్ళు తెరిచి ఉండటం తో ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఈ వార్త క్షణాల్లో వైరల్ అవుతుంది..ఆ వింతను చూడటానికి చుట్టూ ప్రక్కల నుంచి భక్తులు పోటేత్తారు.కార్తీక మాసం ఆఖరి సోమవారం రోజున ఈ వింత చోటు చేసుకోవడంతో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు…ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. మీరు కూడా ఆ వీడియోను ఒకసారి చూడండి..