టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ ఇంట విషాదం..

-

టీమిండియా సారధి రోహిత్ శర్మ ఇంట విషాదం చోటుచేసుకుంది. శ్రీలంకతో మ్యాచ్ ఆడేందుకు అతను సిద్ధమవుతున్న సమయంలోనే ఈ విషాదం చోటు చేసుకోవడం బాధాకరం. ఈ వార్తను రోహిత్ భార్య రితిక సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. శ్రీలంక మ్యాచ్ మొదలవడానికి ఒక రోజు ముందే ఈ ఘటన జరిగింది. సోమవారం జరిగిన ఈ విషాదం గురించి రితిక చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

కాగా, ఈ మ్యాచ్ లో రోహిత్ హఫ్ సెంచరీ పూర్తి చేశాక ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఎందుకంటే, జనవరి 9న రోహిత్ అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క మ్యాజిక్ చనిపోయింది. ఈ విషయాన్ని రోహిత్ భార్య రితిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. మ్యాజిక్ లేదన్న బాధలోనే ఈ మ్యాచ్ బరిలోకి దిగిన రోహిత్, ఫిఫ్టీ పూర్తి కాగానే ఆకాశం వైపు చూస్తూ మ్యాజిక్ పేరును స్మరిస్తూ, చాలాకాలం తర్వాత చేసిన కీలక హాఫ్ సెంచరీని మ్యాజిక్ కు అంకితం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news