U19 World Cup : ఉగాండాపై 326 పరుగుల తేడాతో టీమిండియా బంపర్ విక్టరీ

-

అండర్‌ -19 వరల్డ్‌ కప్‌ లో టీమిండియా యువ జట్టు దూసుకుపోతుంది. అండర్‌ -19 వరల్డ్‌ కప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌ లోఇండియా 326 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి మొదట బౌలింగ్‌ చేసిన ఉగాండ జట్టుకు టీమిండియా బ్యాట్స్‌ మెన్లు చుక్కలు చూపించారు. 50 ఓవర్లలో ఏకంగా 405 పరుగులు చేసింది టీమిండియా.

మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రాజ్‌ బాబా 162 పరుగులు, ఓపెనర్‌ అంగ్‌ కృష్‌ రఘు వంశీ 144 పరుగులు ఎదురే లేని బ్యాటింగ్‌ తో ఉంగాండా బౌలర్లపై విధ్వంసం సృష్టించారు. గ్రూప్‌ బి నుంచి ఇది వరకే క్వార్టర్‌ ఫైనల్‌ కు చేరిన టీమిండియా ఉగాండపై తన ప్రతాపం చూపించింది. మొదటి బ్యాటింగ్‌ కు దిగిన ఇండియా 50 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి 405 పరుగుల భారీ స్కోరు చేసింది. కాగా.. 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోక దిగిన ఉగండా కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లు  కూడా బాగా రాణించారు. దీంతో టీమిండియా ఘన విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version