గత కొద్ది రోజులుగా తూర్పు లడఖ్ లో ఉద్రిక్త పరిస్థితులకి త్వరలో తెర పడే అవకాశం కనిపిస్తోంది. ఇరు దేశాలూ తమ సైన్యాలను వెనక్కు రప్పించడానికి ఓ అంగీకరానికి వచ్చినట్టు సమాచారం అందుతోంది. మే నెలకు ముందున్న పరిస్థితిని నెలకొల్పడానికి నవంబరు 6న భారత్-చైనా కమాండర్ లెవల్ సైనికాధికారుల మధ్య జరిగిన ఎనిమిదో విడత చర్చల్లో ఒప్పందానికి వచ్చాయి. ఈ చర్చల ప్రకారం తొలుత పాంగాంగ్ సరస్సు వద్ద మూడు దశల్లో బలగాలను వెనక్కు మళ్లించాల్సి ఉంటుంది.
ఈ ట్యాంకులు, బలగాలను తరలించే వాహనాలు సహా సాయుధ వాహనాలను వాస్తవాధీన రేఖకు ఇరువైపులా సమాన దూరంలో వెనక్కు మళ్లించాలని చెబుతున్నారు. ఇక రెండో దశలో పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలో మోహరించిన బలగాల్లో రోజుకు 30 శాతం చొప్పున మూడు రోజుల్లో వెనక్కు తీసుకోవాలి. బలగాల మళ్లింపు ప్రక్రియను పరిశీలించడానికి ఇరు దేశాలూ సంయుక్తంగా ఓ వ్యవస్థను ఏర్పాటుచేయడానికి అంగీకరించాయి. కానీ గతంలో బలగాలను వెనక్కు తీసుకున్నట్టు నటించిన చైనా దొంగదెబ్బ తీసి గాల్వాన్ లోయ వద్ద మన సైన్యం మీద రాడ్లతో దాడికి పాల్పడటంతో 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు కూడా. ఈ సారి ఏమి జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది.