ఉప ఎన్నికల్లో ఓటమి పాలవడం పై టిఆర్ఎస్ లో చర్చ మొదలైంది. అంచనాలు ఎక్కడ తప్పాయి అని లెక్కలు వేసుకుంటున్నారు. నియోజకవర్గములో పని చేసిన నేతల నుండి నివేదికలు ఇవ్వాలని పార్టీ కోరింది.మొత్తం గా ఓటమికి కారణాలపై విశ్లేషణ మొదలు పెట్టింది టిఆర్ఎస్. బిజెపి చాప కింద నీరుల కదులుతున్న పసిగట్టడంలో విఫలం అయ్యమా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది.దుబ్బాక నియోజకవర్గములో స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఓటమి పాలయ్యామా అన్న చర్చ కూడా జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన మూడు ఉప ఎన్నికల్లో గులాభి పార్టీ గెలిచింది.మూడు అసెంబ్లీ స్థానాలకు వేర్వేరుగా జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను దక్కించుకుంది టిఆర్ఎస్. టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగ రెడ్డి అకాల మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక వచ్చింది మొదటి నుంచి తనతో కలసి నడచిన సోలిపేట రామలింగ రెడ్డి కుటుంబానికే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారు.ఉప ఎన్నికల బాధ్యతలను పార్టీ ఆదేశాల ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లా టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తీసుకున్నారు
మొత్తంగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలపై గులాభి పార్టీ సమీక్ష మొదలుపెట్టింది.దుబ్బాకలో పార్టీ శ్రేణులలో అభ్యర్థి విషయంలో ఎంతో కొంత ఉన్న అసంతృప్తి ఓటమికి కారణమా అయ్యిందా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది.మొత్తంగా దుబ్బాకలో ఓటమిపై గులాభి పార్టీలో హాట్ హాట్ చర్చలు…వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ ఉప ఎన్నికల ఫలితాలు తమను అప్రమత్తం చేశాయని గులాభి పార్టీ వర్గాల్లో తమలో తాము సర్దిచెప్పుకుంటున్నాయి.