ఇండియా కరోనా విలయ తాండవం.. ఒక్క రోజే దేశంలో 1,79,723 కొత్త కేసులు..

-

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,79,723 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,57,07,727 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 7,23,619 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 549 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,83,936 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 46,569 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,45,00,172 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,51,94,05,951 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 29,60,975 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

 

Read more RELATED
Recommended to you

Latest news