రాజస్థాన్ లో దారుణం… మైనర్ విద్యార్థినిపై టీచర్ అత్యాచారం.

-

రాజస్థాన్ లో దారుణం జరిగింది. ఉపాధ్యాయుడే మైనర్ విద్యార్థిపై అత్యాచారానికి  ఒడిగట్టాడు. 11 తరగతి చదువుతున్న విద్యార్థినిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు విద్యార్థిని చదివుతున్న పాఠశాలతోనే అతను టీచర్ గా పనిచేస్తున్నాడు.

వివారాల్లోకి వెళితే… రాజస్థాన్ రాష్ట్రం జోధ్ పూర్ జిల్లా ఒసైన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈనెల 6న పొరుగింటి వారితో కలిసి విద్యార్థిని తోటపనికి వెళ్లింది. అయితే సాయంత్రం అయినా తిరిగి రాలేదు. కలవరపడ్డ కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా… బాలిక జాడ కనిపించలేదు. కాగా.. బాలికను కిడ్నాప్ చేసిన ఉపాధ్యాయుడు తన వాహనంలోనే ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇదే కాకుండా… మరో ఇద్దరిని తీసుకువచ్చి బాలికపై సామూహికంగా అత్యాచారానికి తెగబడ్డారు. బాలికను తన ఇంట్లోని బాత్ రూంలో బంధించాడు.

అత్యాచారం

అయితే శుక్రవారం ఉదయం బాలిక అరుపును విన్న గ్రామస్థులు.. బాత్ రూంలో బంధించిన బాలికను కాపాడారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు.. పోలీసులు, ఉపాధ్యాయుడితోె సహా మరో ఇద్దరిపై కిడ్నాప్ అత్యాచారం కేసులు నమోదు చేశారు.  టీచర్​ని అరెస్ట్​ చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news