చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ఇండియాను వదలడం లేదు. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,85,914 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,00,85,116 కు చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 22,23,018 కు చేరింది.
ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 665 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,91,127 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,99,073 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,73,70,971 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,63,58,44,536 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 59,50,731 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.
India reports 2,85,914 new #COVID19 cases, 665 deaths and 2,99,073 recoveries in the last 24 hours
Active case: 22,23,018
Daily positivity rate: 16.16%Total Vaccination : 1,63,58,44,536 pic.twitter.com/hpxnJKfSep
— ANI (@ANI) January 26, 2022