ఇండియాలో కొత్తగా 27,553 కరోనా, ఓ‌మిక్రాన్ 1525 కేసులు

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవల ఈ కాలంలో 10 వేలకు లోపు కరోనా కేసులు నమోదు అయ్యేవి. కానీ ప్రస్తుతం తన కేసుల సంఖ్య 20 వేలకుపైగా నమోదవుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… నిన్నటి కంటే ఇవ్వాళ కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరిగిపోయాయి.

గడిచిన 24 గంటల్లో దేశంలో 27,553 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,22,801 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.36 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 284 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,81,770 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9249 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,42,45, 561 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,45,44,13, 005 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 25,75,225 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. అటు ఓ‌మిక్రాన్ కేసులు 1525 కు చేరుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news