చైనాకు మరో షాక్ ఇచ్చిన భారత్..!

-

చైనాకు మరో షాక్ తగిలింది. జాతీయ రహదారి నిర్మాణ ప్రాజెక్టుల్లో చైనా సంస్థలపై నిషేధం విధిస్తునట్లు ప్రకటించింది. ఈ విషయాన్నీ కేంద్ర రోడ్డు రవాణా శాఖ నితిన్ గడ్కరీ వెల్లడించారు. తాజాగా గడ్కరీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హైవే ప్రాజెక్టుల్లో ఇకపై చైనా కంపెనీలను అనుమతించబోమని తెలిపారు. అంతేకాదు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లోనూ చైనా పెట్టుబడులను ప్రోత్సహించబోమని వెల్లడించారు.

మరోవైపు హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనేందుకు భారత కంపెనీల అర్హత ప్రమాణాలు పెంపొందించేలా నిబంధనలను సైతం సడలిస్తామని చెప్పారు నితిన్ గడ్కరీ. గల్వాన్ లోయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చైనా వస్తువులు, కంపెనీలను నిషేధించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే చైనాతో తెగదెంపులు చేసుకుంటోంది భారత్. ఇప్పటికే టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్స్‌ ను నిషేధించి ఊహించని షాక్ ఇచ్చింది భారత్. అంతేకాకుండా చైనా కంపెనీలతో చేసుకున్న పలు ఒప్పందాలను రైల్వేశాఖ కూడా రద్దుచేసుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news