IND Vs PAK : భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. కుంభమేళాలో ప్రత్యేక పూజలు

-

IND Vs PAK : దుబాయ్ వేదికగా జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. టీమిండియా విజయం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఈ ఛాంపియన్స్ ట్రోపీ లో భారత జట్టు విజయం సాధించాలని కోరుతూ ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళా లో ప్రత్యేక పూజలు చేసి, హారతి ఇచ్చారు. భక్తులు, క్రికెట్ అభిమానులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సాధారణంగా పాకిస్తాన్-భారత్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయి ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన పాకిస్తాన్ తన చిరకాల ప్రత్యర్థితో పోటీకి దిగనుంది. రిజ్వాన్ బృందం ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంటే.. రోహిత్ సేన ఈ మ్యాచ్ గెలిచి పాకిస్తాన్ ను ఇంటికి పంపించాలని సిద్ధంగా ఉంది. తొలుత టాస్ గెలిచిన పాక్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 

Read more RELATED
Recommended to you

Latest news