ఆస్ట్రేలియా వన్డేలో ఇండియా నెలకొల్పిన సరికొత్త రికార్డు..

-

ఆస్ట్రేలియాతో రెండు వన్డేలు ఓడిపోయిన తర్వాత భారత జట్టుపై ఒత్తిడి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో కోహ్లీ టీమ్, మూడవ మ్యాచుని చాలా పటిష్టంగా తీసుకుంది. దాంతో మూడవ మ్యాచులో ఆస్ట్రేలియాపై 13పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. హార్థిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్, కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ కలిసి 303పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఆస్ట్రేలియా అన్ని వికెట్లు కోల్పోయి 289పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఐతే ఈ మ్యాచులో హార్థిక్ పాండ్యా, జడేజా కీలక భాగస్వామ్యంతో సరికొత్త రికార్డుని నెలకొల్పారు. 152పరుగుల దగ్గర 5వికెట్లు కోల్పోయి ఉంటే 6వ వికెట్ కు 150పరుగులు చేసి ఆస్ట్రేలియాపై ఆరవ వికెట్ కి అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ఆటగాళ్ళుగా రికార్డు సృష్టించారు. ఈ రికార్డు గతంలో 128పరుగులుగా ఉండే. 1999లో రాబిన్, రమేష్ ఈ భాగస్వామ్యం నెలకొల్పారు.

Read more RELATED
Recommended to you

Latest news