IND vs PAK : దుమ్మురేపిన TRP రేటింగ్స్.. హాట్‌స్టార్ ఆల్‌టైమ్ రికార్డ్

-

ఆసియా కప్ 2022 లో భారత జోరుకు బ్రేక్ పడింది. పాకిస్తాన్ తో ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో అనవసర తప్పిదాలతో టీమిండియా ఓటమిపాలైంది. అయితే.. ఈ మ్యాచ్‌ లో పాక్‌ విజయం సాధించినా.. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పంట పండించింది. రికార్డు వ్యూయర్షిప్ తో సరికొత్త చరిత్ర లెక్కించింది.


ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్స్ ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. గత భారత్, పాక్ మ్యాచ్ దెబ్బకు ఐపీఎల్ 2022 సీజన్ టీ 20 ప్రపంచ కప్ వ్యూయర్షిప్ రికార్డులన్నీ కనుమరుగవ్వగా, తాజా మ్యాచ్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ ను డిస్నీ హాట్ స్టార్ లో గరిష్టంగా కోటి 40 లక్షల మంది చూశారు. ఇప్పటివరకు హాట్ స్టార్ హైయెస్ట్ వ్యూస్ కోటి 30 లక్షలు మాత్రమే.

ఆగస్టు 28న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ వ్యూస్ రాగా, తాజా మ్యాచ్ ఆ రికార్డును అధిగమించింది. గతేడాది టీ 20 ప్రపంచ కప్ లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ కు, ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్లో కోటి 20 లక్షల వ్యూస్ రాగా, గత మ్యాచ్ కోటి 30 లక్షల రికార్డును నమోదు చేసింది. హాట్ స్టార్ లోనే ఇన్ని వ్యూస్ వచ్చాయంటే, టిఆర్ పి రేటింగ్స్ లో స్టార్ స్పోర్ట్స్ రికార్డులు సృష్టించినట్లే.

Read more RELATED
Recommended to you

Latest news