ASIA CUP 2022 : అర్షదీప్ పై ట్రోలింగ్… సిగ్గుండాలి రా అంటూ హర్భజన్ సింగ్ ఫైర్ !

-

పాక్‌ తో జరిగిన మ్యాచ్‌ లో ఆ దేశ బ్యాట్స్‌ మెన్‌ ఆసిఫ్ ఆలీ క్యాచ్‌ ను ఆర్షదీప్ సింగ్ వదిలేసిన సంగతి తెలిసిందే. అయితే.. సమయంలో ఆసిఫ్ ఆలీ ఒక్క పరుగు కూడా చేయలేదు. ఈ జీవనాధారం అనంతరం ఆసిఫ్ ఓ సిక్స్, రెండు ఫోర్లు బాది పాకు విజయానికి బాటలు వేశాడు. ఆసిఫ్ ఎనిమిది బంతుల్లో 16 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఒకవేళ ఆర్షదీప్ ఆ క్యాచ్ ను పట్టి ఉంటే చేజింగ్ లో పాకిస్తాన్ వెనకబడేది.

అప్పుడు ఫలితం మరోలా ఉండేది. కీలక క్యాచ్ ను వదిలేసిన ఆర్షదీప్ పై సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్ వర్షం కురుస్తోంది. ‘నేటి మ్యాచ్ లో ఆర్షదీప్ విలన్’ అని ఒకరు కామెంట్ చేయగా, ‘డ్రెస్సింగ్ రూమ్ లో ఆర్షదీప్ కు ఉంది పో’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. అర్షదీప్ సింగ్ కనబడితే కాల్ చేస్తా అన్నట్టుగా, ఓ ముగ్గురు బైక్ పై బయలుదేరిన మీమ్ నవ్వులు పూయిస్తోంది. మరికొందరు జాత్యహంకార దూషణలకు పాల్పడుతున్నారు.

ఇక అర్షదీప్ సింగ్ తో సహా భారత టీం మెట్లపై వస్తున్న విమర్శల పట్ల మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్రంగా సీరియస్ అయ్యాడు. జాత్యహంకార దూషణలు చేస్తున్న నేటిజనులను ఉద్దేశించి ఇక బాక్వస్ బంద్ చేయండి అన్నారు. ‘మన కుర్రాడు అర్షదీప్ సింగ్ ను విమర్శించడం మానేయండి. ఎవరు కావాలని క్యాచ్ ను వదిలేయరు. ఏదేమైనా మన భారత కుర్రాళ్లను చూసి గర్విస్తున్నాం, పాకిస్తాన్ మెరుగ్గా ఆడింది. ట్విట్టర్ వేదికపై అర్షదీప్ పైన, టీం పైన చౌకబారు కామెంట్లు చేస్తున్న వాళ్లకు సిగ్గుండాలి. ఆర్షు బంగారం’ అంటూ పేర్కొన్నాడు. ఇకపోతే నేటిజెన్లు అర్షదీప్ సింగ్ ను విపరీతంగా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news