ఆ వైసీపీ ఎమ్మెల్యే జంపింగ్ ఫిక్స్?

-

ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తుంటే…నెక్స్ట్ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలకు సీటు దక్కే అవకాశాలు లేవని మాత్రం అర్ధమవుతుంది. ఇప్పటికే సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని జగన్ ముందే చెప్పేశారు. జగన్ వార్నింగ్ ఇచ్చినా సరే కొందరు ఎమ్మెల్యేల పరిస్తితి మెరుగు అవ్వలేదు. ఈ క్రమంలో నిస్సందేహంగా కొందరు ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు ఇవ్వరని చెప్పేయొచ్చు.

మరి సీటు రాని ఎమ్మెల్యేలు ఏం చేస్తారు…మళ్ళీ వైసీపీతోనే ఉంటారు…లేదా అవకాశం చూసుకుని పార్టీ మారిపోతారా? అంటే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అని చెప్పొచ్చు. సీటు దక్కని ఎమ్మెల్యేలు వైసీపీలోనే ఉంటే…నెక్స్ట్ వైసీపీ అధికారంలోకి వస్తే ఏదొక పదవి రావొచ్చు..అలా కాకుండా ఎమ్మెల్యే సీటు మాత్రమే కావాలని అనుకుంటే…వేరే పార్టీలో వచ్చే ఆఫర్ బట్టి…వైసీపీని వీడి వేరే పార్టీలోకి జంప్ అయిపోవచ్చు.

అయితే ఎమ్మెల్యేలు జంప్ అయినా సరే జగన్ పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవు…సరిగ్గా పని చేయని ఎమ్మెల్యేలు వెళ్లిపోతే నష్టం ఉండదని భావిస్తారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కొందరికి సీట్లు రావడం కష్టమనే హింట్ ఇస్తున్నారు. ఇటీవల తాడికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగానే, అక్కడ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ని అదనపు సమన్వయకర్తగా పెట్టారు. దీని బట్టి చూసుకుంటే నెక్స్ట్ శ్రీదేవికి సీటు ఇవ్వరు…ఆ ప్లేస్‌లో డొక్కాకు ఇస్తారని అర్ధమవుతుంది.

ఇక సీటు దక్కని ఎమ్మెల్యేలకు తాడికొండ పెద్ద ఉదాహరణ. మరి నెక్స్ట్ శ్రీదేవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే దర్శిలో కూడా దాదాపు సీటు విషయంలో క్లారిటీ వచ్చేసేలా ఉంది. గత ఎన్నికల్లో ఆర్ధిక కారణాలతో పోటీ నుంచి తప్పుకున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికే దర్శి సీటు దక్కేలా ఉంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కు షాక్ తగిలినట్లే అని చెప్పొచ్చు. ఇక ఈయన జనసేన వైపు వెళ్లొచ్చని ప్రచారం జరుగుతుంది. కాకపోతే ఎన్నికల ముందు పొత్తుల బట్టి మద్దిశెట్టి జంపింగ్ ఖాయమని టాక్ నడుస్తోంది. చూడాలి మరి మద్దిశెట్టి జంప్ అవుతారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news