హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.

-

దీపావళి వేళ ఎక్కడో అక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ గోల్నాకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు చెలరేగాయి. స్థానికంగా ఉండే పేపర్ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం తో మంటలు ఎగిసి పడ్డాయి. ఘటనలో గొడౌన్ లో ఉన్న పాత పుస్తకాలు మొత్తం దగ్ధమయ్యాయి. కాగా విషయం తెలిసిన వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫైరింజన్ల సహాయంతో మంటను అదుపు చేసేందుకు సిబ్బంది క్రుషి చేస్తున్నారు.

అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి ఫిర్యాదు చేయనుంది. కాగా ఇదే గోడౌన్ లో గతంలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది.

Read more RELATED
Recommended to you

Latest news