వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. దీంతో 3 వన్డేల ఈ సిరీస్ లో శుభారంభం చేసి బోణీ కొట్టింది. 309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఆఖరి బంతి వరకూ పోరాడింది.
ఈ నేపథ్యంలోనే చివరి ఓవర్ లో 15 పరుగులు అవసరం కాగా.. 11 పరుగులు చేసి చివరకి 305-6 తో సరిపెట్టుకుంది. అయితే..లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రోమారియో షెపర్డ్ చివర్లో ధాటిగా ఆడి ఇండియాకు చుక్కలు చూపించాడు. హోసీన్ తో కలిసి అతడు విండీస్ ను గెలిపించినంత పని చేశాడు. అయితే, సిరాజ్ ఆఖరి ఓవర్ లో కట్టుదిట్టంగా బంతులేసి ఉత్కంఠకర పరిస్థితుల్లో ఇండియాను గెలిపించాడు.
ఇక టీమిండియాలో కెప్టెన్ శిఖర్ ధావన్ 97 పరుగులు, శుభ్ మన్ గిల్ 64 పరుగులు శ్రేయస అయ్యర్ 54 పరుగులు చేసి శభాష్ అనిపించారు.