టీం ఇండియాకు ఈ వరల్డ్ కప్ చాలా బాగా కలిసి వస్తోంది అని చెప్పాలి. ఎందుకంటే.. మొదటి మ్యాచ్ లోనే ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోవాల్సిన సమయంలో రాహుల్ మరియు కోహ్లీ లు ఆపద్బాంధవుల్లా ఆదుకుని మ్యాచ్ ను గట్టెక్కించారు. ఆ తర్వాత ఆఫ్గనిస్తాన్ పై ఘనవిజయం సాధించగా తాజాగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఇండియా ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది. పాకిస్తాన్ ఇచ్చిన 192 పరుగుల లక్ష్యాన్ని కేవలం 30 .3 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి న్యూజిలాండ్ కన్నా అధిక రన్ రేట్ ను సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని చేజిక్కించుకుంది.
ఈ విజయంలో కుల్దీప్ యాదవ్, సిరాజ్, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ లు ముఖ్య భూమిక పోషించారు. ఇక వరల్డ్ కప్ లో ఇండియాకు మిగిలి ఉంది 6 మ్యాచ్ లు మాత్రమే. ఈ ఆరులో కనీసం నాలుగు గెలిచినా సెమీస్ బెర్త్ కంఫర్మ్ అవుతుంది.