తెలంగాణాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న ఎన్నికలు మరియు డిసెంబర్ మూడవ తేదీన ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. కాగా తెలంగాణాలో ప్రధాన పార్టీలు అయిన BRS,కాంగ్రెస్, బీజేపీ లు సీట్లు ఎంపిక మరియు అభ్యర్థులను ప్రకటించడంలో బిజీ గా ఉన్నారు. అంతే కాకుండా ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో తమ తమ మేనిఫెస్టో లను ప్రజలకు ఆసక్తికరంగా ఉండేలాగా , ఆకట్టుకునేలాగా మలుచుతున్నట్లు తెలుస్తోంది. కాగా అధికార పార్టీకి చెందిన మేనిఫెస్టో అన్ని హంగులను దిద్దుకుని రేపు విడుదల చేయడానికి కేసీఆర్ ముహుర్తాన్ని ఖరారు చేశారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం రేపు మధ్యాహ్నం 12 .15 గంటలకు ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.
ఈ ప్రోగ్రాం లోనే BRS తరపున పోటీ చేసే అభ్యర్థులకు బి ఫార్మ్ లు ఇవ్వనున్నారు. కాగా ఈసారి కేసీఆర్ లు గెలిచే అవకాశం ఉందా లేదా తేలియాలనంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.