Indian 2 : తిరుపతిలో భారతీయుడు 2 షూటింగ్

-

కోలీవుడ్ దర్శక దిగ్గజం శంకర్ షణ్ముగం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సిద్దార్థ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఎంతో గ్రాండ్ గా ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ లో కొద్దిరోజుల క్రితం ఒక ఘోర ప్రమాదం జరిగి, సెట్ లోని భారీ క్రేన్ విరిగి పడి సెట్ లోని వారిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మారుతీ చెందారు. అయితే ఆ దుర్ఘటనతో ఒక్కసారిగా కోలీవుడ్ తో పాటు మిగతా సినిమా పరిశ్రమలు కూడా ఉలిక్కిపడ్డాయి.

ఇది ఇలా ఉండగా.. అయితే.. ఈ సినిమా నుంచి తాజాగా బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ తిరుపతిలో రేపటి నుంచి జరుగనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక్కడ 10 రోజులకు పైగా షూటింగ్‌ జరుగనుందట.

Read more RELATED
Recommended to you

Latest news