రాజస్థాన్‌లోని శ్రీగంగనగర్ సరిహద్దు అవుట్ పోస్టులో మంగళవారం- బుధవారం అర్ధరాత్రి సమయంలో సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) ఇద్దరు స్మగ్లర్లను కాల్చి చంపిందని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. శ్రీగాంగ నగర్ సరిహద్దు అవుట్ పోస్టులోని బిఓపి ఖయాలివాలాకు చెందిన ఎఒఆర్‌లో పాకిస్తాన్ వైపు నుంచి భారతీయ వైపుకు మాదకద్రవ్యాల అక్రమ రవాణా గురించి నిర్దిష్ట ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అందుకుంది ఆర్మీ.
అప్రమత్తమైన బిఎస్ఎఫ్ దళాలు ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నం చేస్తున్న సాయుధ స్మగ్లర్లను గుర్తించి సరిహద్దు కంచె ముందు ఇద్దరు స్మగ్లర్లను కాల్చి చంపారు. వారి వద్ద భారీగా డ్రగ్స్ ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పిస్టల్స్ – 02, మ్యాగజైన్స్ – 04, మందుగుండు సామగ్రి – 28 రౌండ్లు, మాదకద్రవ్యాలు / మందులు- 08 పికెట్లు (సుమారు 8 కిలోలు), నైట్ విజన్ పరికరం- 01 నో (02 కణాలు అదనంగా), పాక్ కరెన్సీ- రూ .13000, పిస్టల్ కవర్- 01 వంటివి స్వాధీనం చేసుకున్నారు.