రష్యా- ఉక్రెయిన్ వార్: భారత త్రివర్ణ పతాకమే రక్ష.. పాకిస్తాన్, టర్కీ స్టూడెంట్స్ కు మన జెండానే దిక్కు

-

ఉక్రెయిన్- రష్యా మధ్య భారీ స్థాయిలో యుద్ధం జరుగుతోంది. యుద్ధం మొదలై ఏడు రోజులకు చేరింది. రోజు రోజుకు యుద్ధ తీవ్రత పెరుగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలు ప్రయత్నిస్తున్నాయి. దీనికి అంతేస్థాయిలో ఉక్రెయిన్ దళాలు అడ్డుకుంటున్నారు. ఇదిలా ఉంటే విద్య సంస్థలకు కేరాఫ్ గా ఉన్న ఉక్రెయిన్ లో చదువుకోవడానికి వచ్చిన ఇతర దేశస్థుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.

ఒక్క భారత దేశం తప్ప.. ఏ ఇతర దేశాలు కూడా తమ దేశస్థులను తీసుకెళ్లేందుకు సాహసించడం లేదు. వారి మానాన వారిని వదిలేశాయి. ఇప్పుడు కొన్ని దేశాలకు భారతీయ త్రివర్ణ పతాకమే అన్నీ అవుతోంది. భారతీయ త్రివర్ణ పతాకాన్ని చేతపట్టి సరిహద్దుల వైపు వెళ్తున్నారు. ముఖ్యంగా మన దాయాది దేశం పాకిస్థాన్, మనల్ని వ్యతిరేఖించే టర్కీ దేశాల విద్యార్థులను భారతీయ జెండానే కాపాడుతోంది. చాలా మంది పాకిస్థానీయులు, టర్కీ దేశ విద్యార్థులు భారతీయుల్లాగే త్రివర్ణ పతాకాన్ని చేతబూని పోలాండ్, రొమేనియా బార్డర్ల వైపు వెళ్తున్నారు.

ఇటు రష్యాతో, అటు ఉక్రెయిన్ తో భారత్ కు ఉన్న స్నేహం కారణంతో పాటు.. హంగేరీ, పోలాండ్, రోమేనియా దేశాలతో ఉన్న స్నేహం కారణంగా భారతీయులు తరలింపు చాలా సులభం అవుతోంది. ఈ సమయంలో మనల్ని రష్యా, ఉక్రెయిన్ దళాలు గుర్తించేందుకు వీలుగా.. భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఉంచుకోవాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. ఇప్పుడు ఇదే పాకిస్తాన్, టర్కీ దేశస్తులకు వరంగా మారింది. వారి ప్రాణాలను కాపాడుతోంది. ఎప్పుడూ మనల్ని విరోధులుగా చూసే దేశాల వారిని మనం కాపడుతున్నాము.

Read more RELATED
Recommended to you

Latest news