తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. 2500 మెట్రిక్ టన్నుల నుండి 6500 మెట్రిక్ టన్నుల వ్యవర్థాలను కలెక్ట్ చేస్తున్నారు. 4500 స్వచ్ఛ ఆటోలను చెత్త కలెక్షన్ కోసం వాడుతున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. పీపుల్స్ ప్లాజా వద్ద 20 మొబైల్ SCTP వాహనాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
మోడర్న్ టెక్నాలజీ దేశాల జాబితాలో తెలంగాణను చేర్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కొద్ది రోజుల్లో మరొక 500 ఆటోలు రానున్నాయి. దీంతో మొత్తం 5వేల వరకు ఆటోలు అవుతాయి. వాహనాల నుంచి చెత్త రోడ్ల మీద పడకుండా మోడర్న్ టెక్నాలజీతో ఈ వాహనాలను తీసుకున్నాం. 17 ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లను తొందరగా ఆధునీకరణ చేయాలని కమిషనర్, మేయర్‌కు సూచించారు. 95 సెకండరీ కలెక్షన్ పాయింట్లను ఏర్పాటు చేసుకున్నామని మంత్రి వివరించారు.
51 మిగతా వాహనాలు వస్తే పరిస్థితి మరింత మెరుగవుతుంది. 24 మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్ ప్లాంట్లను జవహర్‌నగర్‌లో ప్రారంభించుకున్నాం. చెరువుల్లో పెరిగే గుర్రపు డెక్కను తొలగించడానికి 6 ప్లోటింగ్ ట్రాష్ కలెక్టర్‌లను ప్రారంభించామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం విజయానికి అంతా సహకరించాలన్నారు కేటీఆర్.