ట్ర‌క్ డ్రైవ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. ధాబాలు, రిపేర్ షాపుల వివ‌రాలు ఇక వెబ్‌సైట్‌లో..!

-

కేంద్ర రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల మంత్రిత్వ శాఖ ట్ర‌క్ డ్రైవ‌ర్ల‌కు శుభ‌వార్త చెప్పింది. నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను డెలివ‌రీ చేసేందుకు వారు నిత్యం అనేక రాష్ట్రాలలో ప్ర‌యాణిస్తుంటారు. అయితే వారి అవ‌స‌రార్థం దేశ‌వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ర‌హ‌దారుల ప‌క్క‌న ఉండే ధాబాలు, ట్ర‌క్కు రిపేర్‌, పంక్చ‌ర్ షాపుల వివ‌రాల‌ను ఒకే చోట అందిస్తోంది. అందుకు గాను కొత్త‌గా ఓ వెబ్‌సైట్ లింక్‌ను ఏర్పాటు చేశారు.

indian government put a website for all india wide dhabhas and truck repair shops list

ట్ర‌క్ డ్రైవ‌ర్లు https://morth.nic.in/dhabas-truck-repair-shops-opened-during-covid-19 అనే వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే.. అందులో తాము వెళ్తున్న రాష్ట్రంలోని ర‌హ‌దారుల ప‌క్క‌న ఉండే ధాబాలు, ట్ర‌క్ రిపేర్ షాపుల వివ‌రాల‌ను ఫోన్ నంబ‌ర్ల‌తో స‌హా తెలుసుకోవ‌చ్చు. ఈ క్రమంలో ప్ర‌స్తుతం ఈ లింక్‌లో వెస్ట్ బెంగాల్‌, గుజ‌రాత్‌, బీహార్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, అస్సాం, మిజోరాం త‌దిత‌ర రాష్ట్రాల‌కు చెందిన ధాబాలు, ట్ర‌క్ రిపేర్ షాపుల వివ‌రాల‌ను అందిస్తున్నారు. ఇక త్వ‌ర‌లో మిగిలిన రాష్ట్రాలకు చెందిన వివ‌రాల‌ను కూడా వెల్ల‌డించ‌నున్నామ‌ని స‌ద‌రు మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇక ట్ర‌క్ డ్రైవ‌ర్ల‌కు కావ‌ల్సిన స‌హాయం అందించ‌డం కోసం 1033 పేరిట ఓ ఫోన్ నంబ‌ర్‌ను కూడా ఏర్పాటు చేశామ‌ని అధికారులు తెలిపారు. ట్ర‌క్ డ్రైవ‌ర్లు ఈ నంబ‌ర్‌కు కాల్ చేయ‌డం ద్వారా కూడా స‌హాయం పొంద‌వ‌చ్చ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news