చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతున్నది. పూల్-ఎ లో జరిగిన అన్ని లీగ్ మ్యాచ్‌లలో భారత్ భారీ గోల్స్ తేడాతో ఘన విజయాలు నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో మొదటి నుంచి టీమిండియా ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించింది. రెండో నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ భారత్‌కు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత భారత ఆటగాళ్లు కూడా అద్భుత ప్రదర్శన చూపించారు. వరుసగా గోల్స్ చేసుకుంటూ అత్యుత్తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. బంగ్లా ఆటగాళ్లకు గోల్స్ చేసేందుకు సమయం ఇవ్వకుండా చేశారు. దీంతో భారత్ భారత్ 12-0తో చెలరేగారు.
మొదటి నుంచి ఆసియా క్రీడల్లో భారత హాకీ ఆటగాళ్లు పటిష్ట ప్రదర్శన కొనసాగిస్తున్నారు. దీంతో 5 గ్రూప్ మ్యాచ్‌లలో 58 గోల్స్ చేశారు. కాగా భారత్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టు కేవలం 5 గోల్స్ మాత్రమే చేయగలిగింది. భారత జట్టు సెమీఫైనల్ మ్యాచ్ ను రేపు ఆడనుండగా.. సెమీస్‌లో చైనాతో తలపడే అవకాశాలు ఉన్నాయి. సెమీస్‌లో గెలిస్తే భారత్‌కు రజత పతకం ఖాయం కానుంది. ఫైనల్‌లోనూ విజయం సాధిస్తే హాకీ గోల్డ్ మెడల్ భారత్ సొంతం కానుంది. కాగా, పూల్-ఎ లో ఇప్పటి వరకు జరిగిన ఐదు లీగ్ మ్యాచ్‌లలో భారత్ ఏకంగా 58 గోల్స్ సాధించడం ఎంతో విశేషం.