అగ్నిప్రమాదం.. 79 గంటల తర్వాత మంటలు అదుపులోకి..!

-

కువైట్ నుంచి 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురుతో భారత్‌ వస్తూ ఆయిల్ ట్యాంకర్‌ అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఎంటీ న్యూడైమండ్ ట్యాంకర్‌లో ఎట్టకేలకు మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదం జరిగిన 79 గంటల తర్వాత మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చాయని శ్రీలంక నేవీ తెలిపింది. శ్రీలంక తూర్పు తీరానికి సమీపంలో ప్రమాదం సంభవించడంతో శ్రీలంక, భారత నౌకాదళాలు వెంటనే స్పందించి రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి.

ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలు, శ్రీలంక నావికా దళం, భారత దేశం పంపించిన రెండు ఎమర్జెన్సీ టోయింగ్ వెహికల్స్ గాలింపు, సహాయక చర్యలను నిర్వహించాయి. మంటలను ఆర్పడంతోపాటు 23 మంది సిబ్బందిలో 22 మందిని ఇరు దేశాల నావికా దళ సిబ్బంది కాపాడారు. అయితే ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని ఫిలిప్పీన్స్‌ కు చెందిన ఓ నావికుడు మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news