వర్మ “మర్డర్”‌ ట్రైలర్‌.. అన్నీ ప్రశ్నలే..

-

వివాదాస్సద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పవర్‌ స్టార్‌ సినిమాతో కొంత మేర సక్సెస్‌ అయ్యాడు. ఇప్పడు మరో నిజజీవిత కథాంశంతో తెరకెక్కిస్తున్న మర్డర్‌ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశాడు. ట్రైలర్‌ మొత్తం బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో తన మార్క్‌ చూపించాడు. యావత్‌ భారత దేశానికి షాక్‌ ఇచ్చిన ఘటన ఆధారంగా అంటూ మొదలైన ట్రైలర్‌.. పిల్లల్ని ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా?? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా ? పిల్లలను కనగలం కానీ వారి మనస్తత్వాలను కనగలమా..? అంటూ తండ్రి పడిన వేదనను చూపించే ప్రయత్నం చేశాడు. తండ్రి పాత్రలో్‌ శ్రీకాంత్‌ ఐయ్యంగార్‌ నటించగా, కూతురిగా అవంచ సాహితి నటించింది.

అపురూపంగా చూసుకునే కూతురు తనకు ఇష్టం లేని వాడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. అది నచ్చని తండ్రి కూతురు ప్రేమించిన వ్యక్తిని మర్డర్‌ చేయిస్తాడు. ఇది కధాంశం. ఇక ఈ చిత్రానికి ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహించగా, నట్ఇ కరుణ, నట్టి క్రాంతిలు నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news