మహిళలకి ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్…!

-

మహిళలకి ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుండి మహిళలు సీట్ గురించి ఇబ్బంది పడక్కర్లేదని చెప్పింది. ఓ ప్రకటనని ఇండియన్ రైల్వేస్ మహిళల కోసం ప్రకటించడం జరిగింది. పూర్తి వివరాలను చూస్తే.. భారతీయ రైల్వే బస్సు మరియు మెట్రో రైళ్ల వంటి సీట్లను కూడా మహిళలకు రిజర్వ్ చేస్తుంది. ప్రయాణీకుల కోసం ప్రత్యేక బెర్త్‌లను మహిళల కోసం కేటాయించారు. అలానే మహిళల భద్రత విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకునేలా సిద్ధం చేసారు.

Indian-Railways
Indian-Railways

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రైళ్లలో మహిళల సౌకర్యార్థం బెర్త్‌ల ఫిక్సింగ్‌తో పాటు రక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇక ఇది ఇలా ఉంటే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్ ‌లో ఆరు బెర్త్‌లను మహిళల కోసం రిజర్వ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు.

అలానే రాజధాని ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, దురంతో వంటి ఎయిర్ కండిషన్డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో థర్డ్ ఏసీ లో ఆరు బెర్త్‌లు మహిళల కోసం కేటాయించారు. స్లీపర్ కోచ్‌లో ఆరు లోయర్ బెర్త్‌లు, 3 టైర్ ఏసీ కోచ్‌ లో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్‌లు కూడా కేటాయించారు. అలానే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) జిఆర్‌పి, జిల్లా పోలీసులు ప్రయాణికులకు భద్రత కల్పిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news