Special Trains : సంక్రాంతి పండ‌గ‌కు ప్రత్యేక రైళ్లు .. టైమింగ్స్ ఇవే..!

-

Sankranti Festival Special Trains | సంక్రాంతి పండ‌గ వ‌చ్చేస్తోంది. ఉపాధికోసం తరలి వెళ్లిన వారందరూ ఖచ్చితంగా ఈ పండగకు స్వస్థలానికి వెళ్లాలని ప్రయత్నిస్తారు. అందుకే ఆ సమయంలో అటు రైళ్లు, ఇటు బస్సులు అన్నీ విపరీతమైన రద్దీగా నడుస్తుంటాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, తిరుపతి, రాజమండ్రి, వరంగల్… ఇలా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది భారతీయ రైల్వే. మ‌రి వాటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి రూట్‌లో నడిచే రైలు నెంబర్ 07479

ఈ రైలు శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి రూట్‌లో నడుస్తుంది. 8 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రైల్వే. 2020 జనవరి 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 04.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్‌లో రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 09.25 గంటలకు రైలు తిరుపతికి చేరుకుంటుంది. రైలు నెంబర్ 07146: ఈ రైలు తిరుపతి నుంచి కాచిగూడ మధ్య నడుస్తుంది. 2020 జనవరి 9, 16, 23, 30, ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 05.00 గంటలకు తిరుపతిలో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 06.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.

కాచిగూడ-శ్రీకాకుళం మధ్య నడిచే రైలు నెంబర్ 07016

ఈ రైలు కాచిగూడ-శ్రీకాకుళం రోడ్ రూట్‌లో నడుస్తుంది. 8 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రైల్వే. 2020 జనవరి 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో సాయంత్రం 06.45 గంటలకు కాచిగూడలో బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుంది. రైలు నెంబర్ 08501: ఈ రైలు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య నడుస్తుంది. 2020 జనవరి 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25, మార్చి 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 11 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య  నడిచే రైలు నెంబర్ 08573

విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య ఈ రైలు నడుస్తుంది. జనవరి 6, 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 2, 9, 16, 23, 30 తేదీల్లో రాత్రి 10:55 గంటలకు విశాఖపట్నంలో రైలు బయల్దేరుతుంది. మధ్యాహ్నం 01:25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. రైలు నెంబర్ 08502 : సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైలు నడుస్తుంది. 2020 జనవరి 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 29, మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్ 1 తేదీల్లో సికింద్రాబాద్‌లో సాయంత్రం 04:30 గంటలకు రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 04:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు నెంబర్ 08407

భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే వీక్లే ఏసీ ఎక్స్‌ప్రెస్ ఇది. జనవరి 2, 9, 16, 23, 30, ఫిబ్రవరి 6, 13, 20, 27, మార్చి 5, 12, 19, 26 తేదీల్లో భువనేశ్వర్‌లో మధ్యాహ్నం 01:20 గంటలకు రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 09:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 08574: తిరుపతి నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైలు నడుస్తుంది. జనవరి 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25, మార్చి 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 08:30 గంటలకు తిరుపతిలో రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 06:50 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది.

కాచిగూడ నుంచి టాటానగర్ మధ్య నడిచే రైలు నెంబర్ 07438

కాచిగూడ నుంచి టాటానగర్ మధ్య నడిచే రైలు ఇది. జనవరి 6, 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 2, 9, 16, 23, 30 తేదీల్లో కాచిగూడలో మధ్యాహ్నం 1 గంటలకు రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు రాత్రి 7:45 గంటలకు టాటానగర్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 08408: సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ మధ్య ఏసీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తుంది. జనవరి 3, 17, 24, 31, ఫిబ్రవరి 7, 14, 21, 28, మార్చి 6, 13, 20, 27 తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 09:30 గంటలకు రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం 05:15 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news