ఏపీ సీఎం జగన్ కు గ్రేటర్ రాయలసీమ నేతలు ఓ లేఖ రాశారు. పరిపాలన వికేంద్రీకరణను తాము సమర్థిస్తున్నామని, అయితే, ‘సీమ’కు న్యాయం జరగాలన్నది తమ ఆకాంక్ష అని చెప్పారు. గతంలో ఐక్యత కోసం రాజధాని కర్నూలు ప్రాంతాన్ని సీమ ప్రజలు త్యాగం చేశారన్నారు. సీమ ప్రజల త్యాగాలు వృథా కాకూడదన్నారు. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ఆలోచన హర్షణీయమని తెలిపారు. లేఖ రాసిన వారిలో రాయలసీమ నేతలు మైసూరా రెడ్డి, శైలాజానాథ్, దినేష్ రెడ్డి. ఈ సందర్భంగా మైసూరా రెడ్డి మాట్లాడుతూ… మాకు న్యాయం జరగాలన్నారు.
రాజధాని అయితే రాయలసీమ ప్రాంతలో రావాలన్నారు. రాజధాని ఇవ్వకుంటే మా ప్రాంతాన్ని మాకివ్వండి. మాకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలి. మేం ఏం ఆంధ్రా వాళ్లతో కలిసి అలింగనం చేసుకొని ఉంటానడం లేదు. అమరావతి రైతులు చేసింది త్యాగం కాదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారమన్నారు మైసూరా రెడ్డి. అమరావతి రైతుల్ని తాను వ్యతిరేకించడం లేదన్నారు. కానీ రాజధాని విషయంలో రాయలసీమ ప్రజలు చేసింది మాత్రం త్యాగమన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కూడా రాయలసీమ వాసులు కాబట్టి వాళ్లు విజ్ఞతతో ఆలోచించి రాయలసీమపై నిర్ణయం తీసుకోవాలన్నారు.