ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో స్థిరపడతారని పిల్లలను విదేశాలకు పంపి మరీ తల్లిదండ్రులు ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటారు. అయితే పిల్లలు స్థిరపడి తమను ఎదో ఉద్ధరిస్తారు అని అనుకుంటే ఆ పిల్లలు మాత్రం తప్పుదారి పట్టి తల్లిదండ్రులకు అలానే దేశానికి తలవంపులు తీసుకువస్తున్నారు. అలాంటి తల్లిదండ్రుల పేరు చెడగొట్టే పని చేశాడు భారత్ నుంచి వెళ్లిన ఒక విద్యార్థి. సచిన్ అజీ భాస్కర్ అనే భారతీయ విద్యార్థి స్తూడెంట్ వీసా పై అమెరికా వెళ్లి,న్యూయార్క్ బఫె లో సిటీలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ యువకుడు ఒక 11 ఏళ్ల మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తుంది. మైనర్ బాలికను పలు మార్లు తనతో శృగారంలో పాల్గొనాలి అంటూ ఈ మెయిల్,సోషల్ మీడియా ద్వారా తెలిపేవాడు. ఆగస్టు 2018లో ఓ రోజు బాలికను కారులో ఎక్కించుకుని ఆమెపై మూడు గంటల పాటు లైంగిక దాడి జరిపి తిరిగి ఇంటికి చేరుకున్నాడు.
అయితే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చైల్డ్ ఎక్స్‌ప్లోయిటేషన్ టాస్క్‌ఫోర్స్ జరిపిన దర్యాప్తులో భాస్కర్ దురాగతం తేలింది. అయితే పోలీసుల విచారణ లో ఆ యువకుడు నేరం అంగీకరించడం తో అతడికి కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష తో పాటు 2,50,000 జరిమానా లేదా రెండూ పడే అవకాశం ఉందని యూఎస్ అటార్నీ జేమ్స్ పి కెన్నెడీ అన్నారు. అయితే ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం జూన్ 17కు వాయిదా వేసినట్లు తెలుస్తుంది. నిజంగా ఉన్నత చదువుల పేరుతో విదేశాలకు వెళ్లి యువత పక్కదారులు పట్టడం తో నేరాలకు పాల్పడుతున్నారు.