కరోనా తో మంత్రి సలహాదారు మృతి

-

కరోనా ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కరోనా మృతుల సంఖ్య 3 వేల కు పైగా పెరిగిపోగా, కరోనా అనుమానితుల సంఖ్య మరింత పెరిగింది. చైనా లో విజృంభించిన ఈ కరోనా మహమ్మారి చైనా తరువాత తీవ్ర స్థాయిలో కరోనా మరణాలు ఇరాన్ లోనే వ్యాప్తి చెందుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ లో ఈ వైరస్ సోకి 107 మంది మరణించగా, 3 వేల మందికి పైగా ఈ వైరస్ సోకినట్లు ఆ దేశ అధికారులు చెబుతున్నారు. ఇరాన్ లో ఇస్లామిక్ రిపబ్లికన్ లో ఈ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ దేశ డిప్యూటీ ఆరోగ్య మంత్రికి కరోనా సోకగా ,అనంతరం ఆ దేశ ఉపాధ్యక్షురాలికి కూడా కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ఆ దేశంలో 23 మంది ఎంపీలకు కూడా ఈ వైరస్ సోకిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ కరోనా వైరస్ సోకి ఇరాన్ విదేశాంగ మంత్రి సలహాదారు హుస్సేన్ షెఖో లెస్లాం మృతిచెందినట్లు అక్కడి వార్తా సంస్థ తెలిపింది. ఆయన కరోనా వైరస్ సోకడం తో గురువారం రాతి మృతి చెందినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ కరోనా వైరస్ సోకి మరణించిన వారిలో ఆరుగురు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. మంత్రి సలహాదారుగా ఉన్న హుస్సేన్ గతంలో సిరియా మాజీ రాయబారిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా 1981 నుంచి 1997 వరకు కూడా ఆయన ఇరాన్ ఉప విదేశాంగ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 85 దేశాలకు కరోనా వ్యాప్తి చెందింది. 3350 మందికి పైగా కరోనా బారీన పడి మృతి చెందగా, దాదాపు 97500 కరోనా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది. అయితే కరోనా మహమ్మారి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కల్లోలం సృష్టిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news