ఎంత కంట్రోల్‌ చేసినా.. ఆ బూతు సైట్లు రెచ్చిపోతూనే ఉన్నాయ్‌..!

దేశంలో ఇంటర్ నెట్ విప్లవం నడుస్తోంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. డాటా డెడ్ చీప్ గా వస్తోంది. ఇలాంటి సమయంలో నెట్లో అందుబాటులో ఉండే పోర్న్, బూతు సైట్లు యువతను చెడుతోవ పట్టిస్తున్నాయి. వీటిని కంట్రోల్ చేయాలని కేంద్రం చాన్నాళ్లుగా ప్రయత్నాలు సాగిస్తోంది. కొన్నాళ్ల క్రితం చాలా వెబ్ సైట్లను నిషేధించింది కూడా.

ఉత్తరాఖండ్ హైకోర్టు గతేడాది సెప్టెంబర్ 27న పోర్న్ సైట్లపై నిషేధం విధించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపుగా వెయ్యి సైట్లను నిషేధించింది. అయితే ఈ బూతు, పోర్న్ సైట్లను అడ్డుకోవాలన్న కేంద్రం ప్రయత్నం ఫలించడం లేదట. ఎంతగా కంట్రోల్ చేస్తున్నా ఆ పోర్న్ సైట్లు మళ్లీ మళ్లీ పుట్టుకొస్తున్నాయట. ఎన్ని చట్టాలు చేసినా, నిషేధాజ్ఞలు వేసినా.. అవి మళ్లీ వస్తూనే ఉన్నాయట.

మరి ఎందుకు ఇలా జరుగుతోంది. ఈ వెబ్ సైట్లు, మళ్లీ ఎందుకు పుట్టుకొస్తున్నాయి. ఎందుకంటే.. ఒకసారి నిషేధం విధించిన తర్వాత అవే వెబ్ సైట్లు తమ డొమైన్ పేర్లను మార్చి మళ్లీ భారత్ లోకి ప్రవేశిస్తున్నాయట. అంతకు ముందు ఉన్న .com స్థానంలో .org, .net పేర్లలో మళ్లీ పుట్టుకొస్తున్నాయి. విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయట.

మరో కారణం ఏంటంటే.. వీటి సర్వర్లు వేరే దేశాల్లో ఉంటాయి. వాటిని నియంత్రించడం అంత సులభం కాదు. పెద్ద పెద్ద సినీహీరోల సినిమాలే రిలీజైన సాయంత్రానికే ఇంటర్ నెట్లో దర్శనమిస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఈ బూతు వెబ్ సైట్ల సంగతీ అంతే. వీటిని ఎలా అడ్డుకోవాలో తెలియక కేంద్రం తలపట్టుకుంటోందట.