టీడీపీ వైసీపీల మధ్య ఘర్షణ.. ఐదుగురుకి తీవ్ర గాయాలు

కృష్ణా జిల్లాలో కంకిపాడు మండలం మద్దూరు దసరా ఉత్సవాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకోవడంతో ఐదుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.

దసరా వేడుకలు జరుపుకుంటున్న తమపై టీడీపీ నేతలు దాడి చేశారని వైసీపీ నేతలంటుంటే.. వైసీపీ నేతలే దాడి చేశారని టీడీపీ నేతలు అంటుండటం విశేషం. ఘటనస్థలికి చేరుకున్న కంకిపాడు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఇరువర్గాల నేతలు పరామర్శించారు.