దేశంలో 50శాతం మందికి టీకా పంపిణీ పూర్తి

-

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలు రాయిని దాటింది. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా దేశంలోని 50శాతం జనాభా(18 ఏండ్ల పైబడిన వారికి)కు రెండు డోసుల టీకా పంపిణీ పూర్తయిందని కేంద్ర ఆరోగ్య మంత్విత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 127.61 కోట్ల డోసుల పంపిణీ పూర్తయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

దేశంలో అర్హత గల జనాభాలో 50శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడం చాలా గర్వంగా ఉన్నదని మాన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. కొవిడ్-19 వ్యతిరేక పోరాటంలో మనం తప్పకుండా గెలుస్తామని స్పష్టంచేశారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,04, 18,707 కోట్ల టీకాలను పంపిణీ చేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాక్సినేషన్ లభ్యతకు సంబంధించి మెరుగైన ప్రణాళిక ప్రారంభించడం, వ్యాక్సిన్ సరఫరా గొలుసును క్రమబద్ధీకరించడం ద్వారా టీకా డ్రైవ్ వేగవంతం చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news