ఒమిక్రాన్ వేరియంట్ కేసులపై తెలంగాణ వైద్యశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఇంకా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కాలేదని.. తెలంగాణ వైద్య శాఖ అధికారి… శ్రీనివాస్ రావు ప్రకటన చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మంది కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఈ రోజు సాయంత్రం వరకు జీనోమ్ సిక్వెన్స్ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
మహమ్మరిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. హైదరాబాద్ లో రేపో మాపో కొత్త వేరియంట్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని… ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు వైద్యశాఖ అధికారి శ్రీనివాస్ రావు. ప్రాణాలు తీసే గుణం ఒమిక్రాన్ లో లేదని నిపుణులు చెబుతున్నారని.. థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు వైద్య శాఖ సిద్ధంగా ఉందన్నారు. 3 లక్షల మంది నిన్న ఒక్కరోజే వ్యాక్సిన్ వేసుకున్నారని.. వ్యాక్సిన్ పై అవగాహన పెరిగిందనితెలిపారు.