ఆరోగ్య సేతు యాప్ మరో ఘనత సాధించింది. ఏప్రిల్‌లో 80 మిలియన్లుగా ఉన్న డౌన్‌లోడ్ల సంఖ్య జూలై నాటికి 127.6 మిలియన్లకు చేరుకుంది. దీంతో ఇది ప్రపంచంలోనే అధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న కోవిడ్ ట్రాకింగ్ యాప్‌గా నిలిచింది. అయితే ఆరోగ్య సేతు యాప్ కరోనా తాజా సమాచారంతోపాటు, వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలను అందిస్తూ, చుట్టుపక్కల కరోనా రోగులుంటే అలర్ట్ చేస్తుంది.
అయితే జనాభా పరంగా ఈ యాప్ వినియోగంలో భారత్ నాల్గవ స్థానంలో ఉందని అంతర్జాతీయంగా యాప్‌ల డౌన్‌లోడ్స్, వాటి ర్యాంకింగ్‌లను విశ్లేషించే సెన్సర్ టవర్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. కాగా భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు ఆరోగ్య సేతు వంటి ఇతర యాప్‌లను వృద్ధి చేయడంతో అక్కడి జనాభా స్థానిక యాప్‌లను వినియోగిస్తోంది. ఇది ఆరోగ్య సేతు డౌన్‌లోడ్ల సంఖ్యను, వినియోగాన్ని ప్రభావితం చేస్తోంది.