అమెరికాలో భారతసంతతి వ్యక్తికి 50 నెలల జైలు శిక్ష…!!!

-

అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న విదేశీయులలో అత్యధికులు భారతీయులే. దేశం కాని దేశంలో ఉంటూ పరాయి దేశంలో సైతం తమ ప్రతిభాపాటవాలతో కీర్తి శిఖరాలు అందుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. విద్యా, సాఫ్ట్వేర్ , వైద్య , పారిశ్రామిక ఇలా అమెరికాలో అనేక రంగాలలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే కొంతమంది స్వార్ధ పరుల కారణంగా అమెరికాలో భారతీయుల పరువు మంటగలుస్తోంది.

Image result for indian arrest

భారత్ కి చెందిన అనిలేష్ అహుజా అనే వ్యక్తి అమెరికా వచ్చి స్థిరపడి ఎన్నో ఏళ్ళు అవుతోంది. ప్రీమియం పాయింట్ పేరుతో అమెరికాలో ఓ కంపెనీ కూడా స్థాపించారు. దీన్ని అడ్డుగా పెట్టుకుని అమెరికా ప్రజలని మోసం చేయడం మొదలు పెట్టాడు. అతడితో పాటు మరో వ్యక్తి కూడా అతడికి సాయం చేశాడు. దాంతో ఇద్దరూ ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఇంతకీ వీరు చేసిన నేరం ఏమిటంటే.

 

తాము స్థాపించిన కంపెనీ భారీ లాభాలలో ఉందని, ఎంత చివరికి   స్టాక్ మార్కెట్ నష్టాలలో ఉన్నా సరే తమ కంపెనీ మాత్రం నష్టంలో లేదని ప్రచారం చేశారు. అంతేకాదు పీపీఐ షేర్లు కొన్న వారికి సొమ్ములు చాలా వరకూ తిరిగి ఇవ్వలేదు. తమ కంపెనీలో షేర్లు కొన్నవారికి మాయమాటలు చెప్తూ మోసం చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు కాజేశారు. భాదితులు ఇచ్చిన ఫిర్యాదు తో స్పందించిన పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుచాగా కోర్టు ప్రధాన నిందితుడు అహుజా కి 50 నెలల జైలు శిక్ష విధించగా సహాయపడిన వ్యక్తికి 40 నెలల జైలు శిక్ష ఖరారు చేసింది కోర్టు.

 

Read more RELATED
Recommended to you

Latest news