ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక విప్లవం మొదలైంది – ఎంపీ భరత్

-

ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక విప్లవం మొదలైంది అన్నారు ఎంపీ మార్గాని భరత్. రాష్ట్రంలో పెట్టుబడులను చూసి ప్రతిపక్షాలు కడుపు మంటతో విమర్శలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. పెట్టుబడులు పెడతామని వచ్చిన వాళ్లను తప్పు పట్టడం బాధాకరం అన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ కూడా మాట్లాడుతున్నారని విమర్శించారు. టిడిపి హయంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో భారీగా అవినీతి జరిగిందన్నారు.

ఈ స్కామ్ సూత్రధారి నారా లోకేష్ డమ్మీ ఒప్పందం చేసుకొని 300 కోట్ల ప్రజాధనం మింగేసారని ఆరోపించారు. లోకేష్ తనని తాను ముఖ్యమంత్రితో పోల్చుకుంటున్నాడని, సీఎం జగన్ ముందు లోకేష్ ఒక బచ్చా అంటూ మండిపడ్డారు. కియా ఫ్యాక్టరీని చంద్రబాబు తీసుకు రాలేదని, కేంద్రం సిఫార్సు చేస్తే రాష్ట్రానికి వచ్చారని తెలిపారు. ఇందులో ఎవరి పాత్ర లేదన్నారు ఎంపీ భరత్. టిడిపి హయాంలో స్కామ్ లు, జగన్ హయాంలో స్కీంలు అని సెటైర్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news